Swatantra Bharat Party

స్టేట్ – తెలంగాణ అంతటా ప్రెస్ విడుదల

12 డిసెంబర్ 2017

శ్రీ రాహుల్ పండిట్ గారు భారత్ లోని స్వేచ్ఛాయుత స్వర్ణ భారత పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు.ఈ రోజు హైదరాబాదులో ప్రభుత్వ విధానాలపై, మున్సిపల్ కార్పొరేషన్ ఘన-వ్యర్ధాలపై అనుసరిస్తున్న పద్దతులపై నిరసన వ్యక్తం చేసారు.

రాష్ట్ర ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ని నిర్లక్ష్యం చేస్తోందని  అని శ్రీ రాహుల్ అన్నారు. నియమాల ప్రకారం పికప్ సమయంలో చెత్తను వేర్పాటు చేయడం తప్పనిసరి. నేడు, అసురక్షిత వ్యర్థాలు వేరు చేయకుండా డంపింగ్ యార్డ్కు రవాణా చేయబడుతోంది.

దీనివల్ల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, జంట నగరాల్లో, ముఖ్యంగా జవహర్ నగర్ లో  ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఇటీవలి కాలంలో శ్రీ రాహుల్  మరియు వారి బృందం, పర్యావరణ పర్యవేక్షకులు శ్రీమతి అమీనా శర్వాణి  జవహర్ నగర్ పరిసర ప్రాంతాలను సందర్శించారు.జవహర్ నగర్ నివాసితులను డంపింగ్ యార్డు వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వాళ్ళు తీవ్రమైన వాయు మరియు నీటి కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు.బృందం గాలి మరియు నీటి వనరుల కాలుష్యానికి సాకారాలుగా  ఉన్న లీచెట్చెరువులను ఫోటోలు తీసుకున్నారు.జంట నగరాల్లో ఉన్న గాలి,నీటి వనరులను పూర్తిగా విషతుల్యం చేసి మానవాళి మనుగడనే ప్రశ్నిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం జవహర్ నగర్ లో ఘన వ్యర్ధాలను మండించి విద్యుత్తు తయారు చేసే ఒక పవర్ ప్లాంట్ ను ప్రారంభిచాలనుకొంటున్నది.దీనివల్ల భవిష్యత్తులో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గాలి విషతుల్యమవుతుంది మరియు ప్రజలకు హానికరమవుతుంది.శ్రీ రాహుల్ పండిట్ గారు ఈ పవర్ ప్లాంట్ వల్ల ప్రజలకు మేలు జరగకపోగా కీడు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.

మొట్ట మొదటుగా సరియైన పద్దతిలో ఘన-వ్యర్ధాలను వేరుచేసి వాటిని రీసైక్లింగ్ చేసే విధానము అనుసరించాలని అభిప్రాయ పడ్డారు.

ప్రతి ఇంటిలో నుంచి ప్రతి రోజు 400 గ్రా వ్యర్ధాలు వస్తాయి అనుకుంటే వాటిని జీవ వ్యర్థాలు, ప్లాస్టిక్-పేపర్-గ్లాస్ వ్యర్థాలుగా  విభజించాలి.జీవ వ్యర్థాలను కాలనీలు వాటికవే స్వతంత్రంగా ఎరువులుగా మార్చుకోవచ్చు.ఈ విధమైన ఎరువులను మన గృహాల్లో మరియు పార్కులు,వ్యవసాయంలో వాడుకోవచ్చు.మరియు కొత్త ఉపాధిని కల్పించుకోవచ్చు.గ్లాసు,ప్లాస్టిక్ మరియు పేపర్ వాటిని గ్రేడ్ల విధానంగా విభజించి రీసైక్లింగ్ చేయవచ్చు.ఈ విధానమునకు మనం ప్రాముఖ్యత ఇవ్వటం ద్వారా కాలుష్యం వల్ల భూమి,గాలి,నీరు కి వచ్చే ప్రమాదాన్ని అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి తగ్గించవచ్చు..

స్వర్ణ భారత పార్టీ ఘన వ్యర్ధాలపై ఇప్పుడు జంట నగరాల్లో అనుసరిస్తున్న విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తుంది.మరియు పర్యావరణ హితమైన మానవాళి మనుగడకు హితంగా నిలిచే ఘన వ్యర్ధాలపై  సరియైన విధానాలను ప్రారంభిస్తుంది.

SBP చాలా ధృడమైన సంకల్ప బలంతో సరియైన మానవతా విలువలకు ప్రాధాన్యమిస్తుంది.రోడ్లను మురికిగా చేయటం,అవగాహన రాహిత్యంతో రాసే ప్రకటనలను, ధోరణులను వ్యతిరేకిస్తోంది.స్వర్ణ భారత పార్టీ  బృందం వారు ఇండియాలో పూర్తిగా వెనుకబడిన గ్రామీణ,నగర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ వారిలో చైతన్యం కోసం వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు.ఈ విధానంలో ఎంతోమంది యువత ఉపాధి అవకాశాలను గుర్తించి లబ్ది పొందుతున్నారు.

శ్రీ రాహుల్ పండిట్ గారు జంట నగరాల్లో ఉన్న ప్రజలందరిని పూర్తి మద్దతుతో ఈ ప్రయాణంలో పాల్గొనాలని,ప్రపంచంలోనే అత్యున్నత సమున్నత స్థాయిని నిజమైన స్మార్ట్ నగరంగా హైదరాబాదును ని తీసుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు.

ఎడిటర్లకు గమనిక:

స్వర్ణ భరత్ పార్టీ దేశంలోని ప్రజలు యొక్క  స్వేచ్ఛను మరియు శ్రేయస్సును ప్రోత్సహించే ఏకైక పార్టీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *